అన్నాదమ్ములు ఒక్కటయ్యారు..

ఏపీ రాజధాని అమరావతి ఇద్దరు తెలుగు సీఎంలను ఒక్కటి చేసింది.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం ఇద్దరు బద్ధ శత్రువులు ఒక్కటయ్యారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోవడంతో ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఏర్పాడ్డాయి.. విమర్శలు కొనసాగాయి.. కానీ నేడు పరిస్థితి మారింది..

kcr2

ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. తన మకాంను విజయవాడకు మార్చి ఏపీ పరిపాలనను విజయవాడనుంచే చేయడం మొదలుపెట్టారు. దీంతో హైదరాబాద్ లో ప్రశాంతత నెలకొంది.. కేసీఆర్ కు ఉపశమనం లభించింది.. ఇక అమరావతి శంకుస్థాపన ప్రక్రియకు కేసీఆర్ ను ఇంటికి వెళ్లి పిలిచి చంద్రబాబు అందరి మనసులు చూరగొన్నారు. ఒకప్పుడు చంద్రబాబు కిందే పనిచేసిన కేసీఆర్ .. చంద్రబాబును కారుదగ్గరకొచ్చి మరీ ఆహ్వానించి అన్నా బాగున్నావా అంటూ పలకరించడంతో ఇద్దరి వివాదం దూదిపింజలా సమసిపోయింది..

kcr3

కేసీఆర్ రాజధాని శంకుస్థాపనకు రావాలి అనగానే తప్పకుండా వస్తానన్నాడట కేసీఆర్.. అంతేకాదు.. దాదాపు 50 నిమిషాలు కేసీఆర్ ఇంట్లో గడిపిన చంద్రబాబు.. కేసీఆర్ తో పది నిమిషాలు ఏకాంతంగా మంతనాలు జరిపారు. బహుషా ఓటుకు నోటు స్కాం గురించేమో.. ఈ పరిణామంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొంది..

kcr4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *