Breaking News

అన్నాతమ్ముడు ‘ప్రశ్నించారు’

chiru_pawan--

ఎన్నికలయ్యాక ఏడాదికి తమ్ముడు ప్రశ్నించాడు..నిన్న అన్న ప్రశ్నించాడు.. మొత్తానికి ప్రశ్నించారు ఇద్దరు.. ఏపీలో ఎన్నికలయ్యాక కనిపించని అన్నా తమ్ముడు ఎట్టకేలకు తామున్నామని ఏపీ ప్రజలకు గుర్తు చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ ఎంపీలపై ఫైర్ అయితే.. అన్న చిరంజీవి ఏకంగా ఏపీ సీఎం తీరునే తప్పుబట్టాడు.. వారు వీరి ధ్యేయం ఒక్కటే అది రాజకీయ మనుగడలో తామున్నామని నిరూపించడమే..

పవన్ కళ్యాణ్ మాట్లాడింది అర్థం కాలేదు.. కానీ ఆయన ఆవేశం అర్థమైంది. ఏపీ ఎంపీలంతా వ్యాపారస్థులు స్వార్థ పరులు అన్న విషయం తేటతెల్లమైంది. ఏపీ చంద్రబాబు సంకెళ్లతో అణుచకున్న ఆవేశాన్ని పవన్ పై చూపించలేకపోయారు ఏపీ ఎంపీలు.. కానీ పవనాలు మాటలు వారి వీపుకు, ముఖానికి గుచ్చుకొని ముఖం వాడిపోయింది..

కాగా చిరంజీవి ఈసారి స్క్రిప్ట్ ను భలే బట్టీ పట్టుకొచ్చారు. రాజ్యసభ ఎంపీగా ఆయన ఎదుగుతున్న కొద్దీ ఆయన భాష వేష, రాజకీయ పరిణతి కొంచెం పెరిగింది. అందుకే ఈసారి చంద్రబాబుపై విసిరిన మాటల తూటాలు పేలాయి.

మొత్తానికి అన్నాతమ్ముడు రాజకీయాల్లో అమాస, పున్నాలకు వచ్చే చంద్రుల్లా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.. సూర్యుడిలా రోజు ప్రకాశిస్తే ఏపీ ప్రజల కష్టాలు కొంతైనా తీరుతాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *