అన్నపూర్ణ స్టూడియో జప్తు కోసం నోటీసులు

annapurna studio

హైదరాబాద్, ప్రతినిధి : ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోను జప్తు చేస్తామంటూ ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకులు నోటీసులిచ్చాయి. అన్నపూర్ణ స్టూడియో మీద అక్కినేని నాగార్జున, ఆయన అన్న అక్కినేని వెంకట్ లు రూ. 30 కోట్ల చొప్పున రెండు బ్యాంకుల్లో మొత్తం రూ.60 కోట్లు రుణం తీసుకున్నాయి. వాటిపై వడ్డీని, అసలు గత ఏడాది కాలంగా చెల్లించకపోవడంతో బ్యాంకులు సోమవారం నోటీసులు ఇచ్చాయి.

రుణం కనుక చెల్లించకపోతే అన్నపూర్ణ స్టూడియోను స్వాధీనం చేసుకుంటామని రెండు బ్యాంకులు అక్కినేని నాగార్జున, వెంకట్ తో పాటు ఆ స్టూడియోకు డైరెక్టర్లుగా ఉన్న  వై సుప్రియ, నిమ్మగడ్డ ప్రసాద్, ఏ.నాగసుశీల, వెంకటేశ్ రొడ్డంలకు అందజేశారు. నోటీసుకు స్పందిచంకపోతే స్టూడియో జప్తు కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *