అనుష్క 'రుద్రమదేవి' షూటింగ్ పూర్తయింది

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణా టీమ్ ర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ దర్శకుడిగా, నిర్మాణగా తెరకెక్కుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ సినిమా విశేషాలు వెల్లడించారు.

‘2002లో రుద్రమదేవి చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథా రూపకల్పన పనులు ప్రారంభం కాగా, 2012 ఫిబ్రవరి నుండి ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. 2013 ఫిబ్రవరిలో వరంగల్ లోని వేయి స్థంబాల గుడిలో ఈ చిత్రం ముహూర్తం జరుపుకోగా, 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్ గోపన్నపల్లిలో వేసిన ఏడు కోటగోడల సెట్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగుజాతి చరిత్ర, సాహసం కళ్లకి కట్టేలా భారీ స్థాయిలో ఈ చారిత్రాత్మక చిత్రం రూపొందింది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో స్టీరియో స్కోపిక్ 3డిలో నిర్మాణమైన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఈ త్రీడి టెక్నాలజీ ఖచ్చితంగా ప్రేక్షకులకి అంతర్జాతీయ స్థాయి విజువల్ థ్రిల్ కలిగించబోతోంది. ఆ నమ్మకంతోనే పలు ప్రాంతాల్లోని ఎగ్జిబిటర్లు త్రీడి ప్రదర్శనకు అనుకూలంగా తమ థియేటర్లని సిద్ధం చేసుకోవడానికి ముందుకి రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ అన్నారు. త్రీడితో పాటు రెగ్యులర్ 2డి విధానంలో కూడా ఈ సినిమా విడుదలవుతుంది. ఓ మహాయజ్ఞంలా సాగిన ఈ సినిమా షూటింగులో, ఇది తమ సినిమాగా భావించి సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వేలాది మంది కార్మికులందరికీ ఈ సందర్భంగా దర్శక నిర్మాత గుణశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబరులో విడుదలకి ముస్తాబయ్యేలా శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి’ అన్నారు.

రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా, కృష్ణం రాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్య మీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీ రాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ, తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.