Breaking News

అనాధ, వృద్ధులకు బ్లాంకెట్ల పంపిణి

అనాధ, వృద్ధులకు బ్లాంకెట్ల పంపిణి

కరీంనగర్: బిక్షాటన చేస్తున్న, అనాధ, వృద్ధులకు చలి తీవ్రత నుండి రక్షణ కల్పించేందుకు కరీంనగర్ శాశ్వత శాంతికమిటి ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు బ్లాంకెట్ల పంపిణి కార్యక్రమం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి కమలాసన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమీషనరేట్ కేంద్రం నుండి ప్రారంభమైన శాంతికమిటి సభ్యులు తెలంగాణ చౌక, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ప్రభుత్వ అనాధ, వృద్ధుల ఆశ్రమం, హౌజింగ్ బోర్డు కాలనీలలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం, తెలంగాణ తల్లి విగ్రహం, బస్టాండ్ ప్రాంతాల్లో చలికి తట్టుకోలేక ఇబ్బందుల పడుతూ బిక్షాటన చేస్తున్న అనాధ, వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ వి.బి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి దాన, ధర్మాలు చేసేందుకు తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తం ఖర్చుచేయాలన్నారు. ప్రజాసేవ చేసినప్పుడే జీవితానికి సార్ధకత దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. శాశ్వత శాంతికమిటి ఆధ్వర్యంలో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎసిపి జె.రామారావు, ఇన్స్ పెక్టర్లు.హరిప్రసాద్, సదానందం, శాంతికమిటి సభ్యులు మహమూద్, ముర్తుజా, ఘన్ శ్యామ్ ఓజా, జనార్ధన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

v-b-kalasan-reddy     blankets-pampini

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *