
అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నారు బూర్గుపల్లి కి చెందిన డాక్టర్ నేరెళ్ల రాజేశం గౌడ్ . గంగాధర మోహన్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ( N G O) ఆద్వర్యంలో గంగాధర మండల కేంద్రం లో అనాధ శరణాలయం కొరకు మిక్సీ , పిల్లలకు ప్లేట్లు గ్లాసులను బూరుగు పల్లి గ్రామానికి చెందిన గ్రామీణ ప్రథమ చికిత్స వైద్యులు నేరేల్ల రాజేశం గౌడ్ తన స్వంతంగా కొనివ్వగా , శుక్రవారం అనాధ శరణాలయం లో గంగాధర ఎస్ ఐ స్వరూప్ రాజ్ చేతుల మీదుగా వ్యవస్తాపక అద్యక్షులు గంగాధర మోహన్ కు, పిల్లలకు అందచేశాారు. అనాధ పిల్లలను చేరదీసి వారికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు గంగాధర మోహన్‌ను ఆర్థిక సహాయాన్ని అందజేసిన డాక్టర్ నేరెళ్ల రాజేశం గౌడ్ ను పలువురు అభినందించారు.