అనాథలకు తెలంగాణ ప్రభుత్వ అండపై సర్వత్రా హర్షం

పదోతరగతి వరకు అనాథలకు అంతటా గురుకుల పాఠశాలలున్నాయి. కానీ ఆ తర్వాత వారు ఉన్నత చదువులకు దూరం అవ్వాల్సిందేనా.. ‘మమ్మల్ని పట్టించుకోండి సార్’ అన్న ఒక అనాథ బాలిక పిలుపుతో కేసీఆర్ లో వచ్చిన కదలిక ఒక మంచి ప్రయత్నానికి నాంది పలికింది. అందుకే అనాథలకు ఇక అమ్మా.. నాన్న తెలంగాణ ప్రభుత్వమే అని ప్రకటించారు సీఎం కేసీఆర్.. కార్యాచరణను సిద్ధం చేశారు.

రాష్ట్రపతి వర్షాకల విడది కోసం హైదరాబాద్ కు రానున్నారు. ఆయన తో యాదగిరిగుట్టలో అనాథల కోసం గురుకుల కళాశాలకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదగిరి గుట్టతో పాటు జిల్లాకు ఒక గురుకులం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిధులు వెచ్చించనుంది.

0002

 

కాగా ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు, డాక్టర్ జ్యోతిరెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. అంతమంది అనాథలకు జీవితాలను ఇస్తున్న కేసీఆర్ గారికి పాదాభివందనాలంటూ ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఆమె డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి అనాథలకు ప్రభుత్వం ఆశ్రమం పై తన సంతోషాన్ని వెలిబుచ్చి ఆయనకు బోకె ఇచ్చి.. ప్రభుత్వానికి సహకరిస్తామని.. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసి ఆయన నిండునూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *