Breaking News

అనాథను పెళ్లాడిన పూజారి

001

కరీంనగర్: బాలసదనంలో పూజ అనే అనాథ 20 ఏళ్లుగా పెరిగింది.. పూజను పెళ్లి చేసుకునేందుకు గిరిజశంకర శర్మ అనే యువకుడు ముందుకొచ్చాడు. నా అనే వారు ఎవరూ లేకపోవడంతో అన్నీ తామే అయ్యారు అధికారులు.. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని గీతాభవన్ హాల్ వారి పెళ్లి వేదికగా మారింది.. మేళ తాళాలు, పురోహితుల మంత్రాల మద్య శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. వివాహానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరై ఆశీర్వదించారు. కొత్త జంట ఆదర్శ ప్రాయంగా ఉండి మరిన్ని ఇలాంటి వివాహాలకు స్ఫూర్తినివ్వాలని వివాహానికి హాజరైన వారందరూ ఆకాంక్షించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *