అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్

* పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్, కరీంనగర్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

* ఉపాధిహామి నిధులతో చేపట్టాల్సిన సీసీ రోడ్ల నిర్మాణంపై సమీక్ష

* మార్చి 31 లోగా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులన్ని పూర్తి చేయాలి

* నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పనులు చేపట్టాలి

* మిషన్ భగీరథ పైప్ లైన్, ఫైబర్ గ్రిడ్, డ్రైనేజీ పైపుల కోసం ప్రతి 50 అడుగులకు కనీసం 8 ఇంచుల పైప్ లను సీసీ రోడ్డు నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయాలి

* గ్రామ పంచాయతీలనుండి వెంటనే తీర్మాన పత్రాలు తీసుకొని పనులు ప్రారంభించాలి, నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

* టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలకు సంబంధించి పేపర్ వర్క్ పూర్తి చేయాలి, కోడ్ ముగియగానే పనులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉండాలి

* ప్రజా ప్రతినిధులందర్ని భాగస్వామ్యం చేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశం

* ఉపాధిహామీలో కేంద్రం నుండి వచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ రూపోందించుకోవాలి.

హైదరాబాద్ : మార్చి 31 లోగా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరీంనగర్ కలెక్టర్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఈఎన్సీ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేంద్రం నుంచి ఉపాధిహామీ పనుల కోసం మంజూరయ్యే ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ దిశగా ప్రజా ప్రతినిధులందర్ని భాగస్వామ్యులను చేసి, ముందుకు వెళ్లాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలో మినహా అన్ని జిల్లాలోను తక్షణమే మంజూరైన సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీచర్ ఎమ్మెల్సీ కోడ్ ఉన్న జిల్లాలోనూ పేపర్ వర్క్ పూర్తి చేసి, కోడ్ ముగియగానే పనులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉండాలన్నారు. రోడ్ నిర్మాణ విషయంలో నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పనులు చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిషన్ భగీరథ పైప్ లైన్, ఫైబర్ గ్రిడ్, డ్రైనేజీ పైపుల కోసం ప్రతి 50 అడుగులకు కనీసం 8 ఇంచుల పైప్ లను సీసీ రోడ్డు నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలనుండి వెంటనే తీర్మాన పత్రాలు తీసుకోవాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *