Breaking News

అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష

అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష

హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంపు ఆఫీసు లో ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ , ఈ సమావేశంలో అధికారుల నుండి రాష్ట్రం లోని గురుకుల పాఠశాలల విద్యార్థుల అడ్మిషన్ గురించి తెలుసుకున్నారు. మంత్రి  మాట్లాడుతూ గురుకులాల విద్య పై పెద్ద ఎత్తున ప్రజల వందశాతం ఖాళీ లను భర్తీ చేయాలన్నారు, అదే విధంగా గురుకులలో ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై దాదాపు లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 5.వ తరగతి నుండి 7.వ తరగతి వారికి డైట్ చార్జీలు రూపాయలు 11,00, ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులకు 15,00 రూపాయలు డైట్ చార్జీలు అందిస్తుంది అన్నారు. అలాగే ఉచిత భోజనం, వసతిని కల్పిస్తూ సంవత్సరానికి మూడు జతల యూనిఫారాలు మరియు ఒక ట్రాక్ షూట్,బెల్ట్, ఐడి కార్డు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్ లు ఉచితంగా అందిస్తున్నాం అన్నారు 8.వ తరగతి నుండి ఇంటర్ చదివే విద్యార్థులకు మినీ ఆక్స్ ఫార్డ్ డిక్షనరీని అందిస్తున్నాము ఇలాంటి చాలా సౌకర్యాలు విద్యార్థులకు గురుకుల పాఠశాలలు, కళాశాలలో అందిస్తున్నాం అన్నారు. గురుకుల పాఠశాల ఉత్తీర్ణత శాతం చూసి ప్రజలలో వస్తున్నా పెద్ద ఎత్తున వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని నెలాఖరులోగా వందశాతం అడ్మిషన్ పూర్తి చేయాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *