అధికారంలో ‘నిజాయితీ’.. ప్రతిపక్షంలో అవినీతి

congress-march2

అధికారంలో ఉన్నవాళ్లకు అంటకాగే సీబీఐ తీరు ఇప్పుడు బీజేపీ పక్షాన ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా సుప్రీం కోర్టు ఆదేశించినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించని దర్యాప్తు సంస్థ ఇప్పుడు ప్రశ్నించడానికి సంసిద్ధమవుతుంది. బీజేపీ ప్రోద్బలంతో రివర్స్ గేర్ మార్చింది. దీనిపై కాంగ్రెస్ పక్షాలు భగ్గుమన్నాయి. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ విషయంలో సోనియా ఇంతలా స్పందించడంపై రాజకీయ పక్షాలు, మీడియా ను ఆశర్యపరిచింది. ఆమె ఎప్పుడు నిరసనల జోలికి, జనంలోకి రావడానికి పూనుకోలేదు. కానీ నేడు స్వయంగా ర్యాలీ తీయడంతో కాంగ్రెస్ శమరశంఖం పూరించినట్టు అయ్యింది. ఈ విషయంలో సుప్రీం కోర్టులో కూడా తేల్చుకుంటామని కాంగ్రెస్ శ్రేణులు సవాలు విసిరాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *