
చుట్టూ సముద్రం.. అక్కడక్కడ చిన్న ద్వీపాలు.. అదే లక్ష ద్వీప్.. భారత దేశానికి పశ్చిమ ప్రాంతంలో కేరళకు కొన్ని వందల కిలోమీటర్లలో ఉన్న లక్ష ద్వీప్ కు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. ఎంతో ఆహ్లాదంగా ప్రకృతి నడిబొడ్డున పచ్చని పచ్చగడ్డ, అడవులతో ఆద్యంతంగా అద్భుతంగా ఉంటుంది లక్షద్వీప్.. దీని గురించి చాలా మందికి తెలియదు.. కానీ ఈ మధ్య మోడీ ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించడంతో ఇక్కడికి టూరిస్ట్ ల సంఖ్య పెరుగుతోంది.
సముద్రం మధ్యలో చిన్న చిన్న ద్వీపాల సమూహామే లక్ష ద్వీప్.. ఇక్కడ టూరిజమే ప్రధాన ఆదాయ వనరు.. చిన్నగా ఉండే భూభాగంపైనే అగట్టి ఏయిర్ పోర్ట్ .. రన్ వే ఉంది. ఆ అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడకి వెళ్లడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కేరళ నుంచి నౌకలు ఉంటాయి. లేదా విమానాల్లో వెళ్లొచ్చు. మంచి పర్యాటక ప్రదేశం ఇది..