అద్భుతం.. సిద్దేశ్వర్ టెంపుల్

మహారాష్ట్ర నుంచి ప్రత్యేక ప్రతినిధి : ఎదురుగా చత్రపతి శివాజీ మహారాష్ట్ర దక్షిణ ప్రాంతంలో తన వసతికి కట్టుకున్న పెద్ద కోట.. ముంబై తర్వాత చత్రపతి శివాజీ సిద్దేశ్వర్ ప్రాంతంలో పెద్ద కోటలో నివాసముండేవాడట.. ఆ కోట ఎంత పటిష్టం ఉందంటే కోట దగ్గరకు శత్రువులు రాకుండా కోట చుట్టూ పెద్ద సరస్సు నిర్మించాడు శివాజీ.. ఆ సరస్సు మధ్యలో ఐదారు ఎకరాల విస్తీర్ణంలో ఉత్తర భారత సంస్కృతితో మంచి కళారూపాలు.. కట్టడాలతో తీర్చిదిద్దిన సిద్ధేశ్వర్ టెంపుల్ .. చూడడానికి గొప్పగా ఉన్న ఈ టెంపుల్ సరస్సు మధ్యలో.. కోటకు ముందు భాగాన గొప్పగా తీర్చిదిద్దారు. ఇందులో శివుని ప్రతిరూపం సిద్ధేశ్వర్ స్వామిగా పూజలందుకుంటాడు.
siddeshwar-03 siddeshwar-01
సరస్సులో నాటుపడవతో సంచారం భలేగా ఉంటుంది. గుడిచూట్టూ గొలుసులతో కట్టేయడానికి పెద్ద పెద్ద ఇనుప చువ్వలు నిర్మించారు. మొత్తం నల్లరాయిని గుడి నిర్మానానికి ఉపయోగించారు. మధ్యలో 5 తలల నాగు కాపు కాస్తున్న సిద్ధేశ్వరుని రూపం ఎంతో ఆకట్టుకుంటుంది. కోట ఎంత పొడువుగా ఉంటుందో టెంపుల్ గోడ కూడా అంతే ఎత్తులో మంచి కళారూపంతో ఆకట్టుకుంటుంది. చూడడానికి భలేగా ఉన్న ఈ సిద్ధేశ్వర్ టెంపుల్ మహారాష్ట్రలో ఉంది.

siddeshwar-04

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.