అదును చూసి కొట్టాడు..

2014-08-19_184420_Revanth-Reddy

టీఆర్ఎస్ కు, కేసీఆర్ పక్కలో బల్లెంలా ఉన్నది ఎవరయ్యా అంటే అది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డియే.. అలాంటప్పుడు సీఎం కేసీఆర్ తో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంటాబయటా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ పాపం రేవంత్ డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యాడు..

కేసీఆర్ పోలీసులకు అత్యాధునిక వాహనాలు, సామగ్రి, శాటిలైట్ ఫోన్లు, బైక్ లు , గన్ లు , ఐటీ పరికరాలు ఎందుకిచ్చాడంటూ గగ్గోలు పెట్టినవారికి ఇప్పుడు సమాధానం దొరికింది. ఎందుకంటే.. పోలీసులు మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవచ్చు. ప్రత్యర్థుల అనుయాయులు తెలుసుకోవచ్చు. అదే చేశారు కేసీఆర్..

రేవంత్ డబ్బులు ఇచ్చి కొనేందుకు ప్రయత్నించడం మొదలు.. అరెస్ట్ అయ్యే వరకు పకడ్బందీగా మొత్తం వీడియోలో రికార్డు అయ్యిందంటే ఇదంతా ప్రీ ప్లాన్ డ్ కాక మరేంటి.? కేసీఆర్ పై దుమ్మెత్తే పోసే రేవంత్ 5 కోట్ల అవినీతి సొమ్ము పంచుతూ ఇంత సింపుల్ గా కేసీఆర్ కు చిక్కుతాడని కలలో కూడా ఊహించలేదు.

ఈ దెబ్బతో కేసీఆర్ అటు రేవంత్ ను, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు ను ఏకకాలంలో దెబ్బతీశారు. మున్ముందు పరిణామాలు ఎలా మారతాయో నన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *