Breaking News

అది అలీబాబా 40 దొంగల పార్టీ

sc st case Revanth Reddy

టీడీపీ నేత రేవంత్ రెడ్డి .. టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీపై తీవ్ర విమర్శలతో ఓటర్లను ఆకట్టుకున్నారు.. టీఆర్ఎస్ అలీబాబా 40 దొంగల పార్టీలాగా ఉందని రేవంత్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని టీఆర్ఎస్ ఉద్యమంలో ఎలుగెత్తి చాటిందని… కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 500మందికి మాత్రమే పరిహారం ఇచ్చి టీఆర్ఎస్ తన అసలు రంగు బయటపెట్టిందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి కూకట్ పల్లి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం నేత అసదుద్దీన్ బీఫ్ తినాలంటే ఎంఐఎంకు ఓటు వేయాలని అన్న వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు రేవంత్.. గోవును అమ్మతో చూస్తామని.. దాన్ని తినాలన్న పార్టీకి ఓటు ఎలా వేస్తారని ఓటర్లను ప్రశ్నించారు.. మొత్తానికి రేవంత్ పంచ్ మార్క్ పఠాకులు బాగానే పేలుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *