అత్యాచారం కేసులో శివసేన నాయకుడి అరెస్టు

థానె : తాను నడిపించే స్కూల్లో చదువుతున్న ఓ బాలికపై అత్యాచారం చేసి.. ఆమెను తల్లిని చేసిన శివసేన నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాసుదేవ్ నంబియార్ (61) జిల్లా శివసేన ఉప నాయకుడు. ఆయనకు కాశ్మీరియా టౌన్షిప్లో ఓ స్కూలు ఉంది. ఆ స్కూల్లో చదివే అమ్మాయి విషయంలోనే నంబియార్ను పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని గుడికి తీసుకెళ్లే నెపంతో పలుమార్లు ఆయన బయటకు తీసుకెళ్లారని, థానెలోని ఓ ప్రాంతంలో ఆమెపై పదే పదే అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. అనంతరం ఆ బాలిక గర్భవతి అయ్యి.. ఈ వారం మొదట్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.దాంతో ఆస్పత్రి నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు నంబియార్పై కేసు పెట్టి, అరెస్టు చేశారు. స్థానిక మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా సెప్టెంబర్11వ తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.