
తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కేంద్ర హోంశాఖ అత్యవసరంగా ఢిల్లీకి రమ్మని కబురంపింది. వెంటనే గవర్నర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ బయలుదేరుతున్నారు.
కాగా ఓటుకు నోటు వ్యవహారం కీలకదశకు చేరుకుంది. రేపోమాపో చంద్రబాబుకు నోటీస్ ఇచ్చేందుకు తెలంగాణ ఏసీబీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఏపీ కూడా ట్యాపింగ్ వ్యవహారం పై విస్తృతంగా దృష్టిసారించింది. దీంతో వేడి రాజుకున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది.