
నెల్లూరు, ప్రతినిధి : కేంద్రమంత్రి వెంకయ్య చాలా రోజుల తర్వాత ఓ సినిమా చూశారట.. అదీ మన పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది సినిమానట.. ఈ విషయాన్ని ఆయన నెల్లూరు జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పేర్కొన్నారు. ‘‘చిన్నప్పుడు ఎన్టీఆర్ ‘గుండమ్మ కధ’, ‘మాయాబజార్’, ఏఎన్ఆర్ ‘సువర్ణసుందరి’ సినిమాలను చూశాను. తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు రెండు కళ్లయితే, మూడో నేత్రం చిరంజీవి. నేను సినిమాలు చూడడం అతి తక్కువ. అలాంటిది పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా మూడుసార్లు చూశా’ను. పవన్ అద్భుతంగా చేశార’ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
మోదీ నాయకత్వం దేశానికి కావాలని కోరుకున్న వారిలో పవన్‌కల్యాణ్ ఒకరు. ఆయన యువ కెరటం. పదవుల కోసం ఎన్నడూ పవన్ ప్రయత్నాలు చేయలేదు. వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమ పడుతున్నారు. యువత ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి’ అని వెంకయ్య కోరారు.