అడవుల రక్షణ, పచ్చదనం పెంపు ప్రభుత్వ ప్రాధాన్యత

అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే క్రమ శిక్షణ చర్యలు తప్పవు

అడవుల రక్షణ, పచ్చదనం పెంపు ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలు

అన్ని జిల్లాల అటవీ అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నతాధికారుల హెచ్చరిక.

అటవీ శాఖ అధికారులు, సిబ్బందిలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, విధి నిర్వహణలోఅలసత్వంగా ఉన్నా, గడువులోగా పనులు పూర్తి చేయకున్నా క్రమశిక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ( పీసీసీఎఫ్ ) పీ.కె. ఝా హెచ్చరించారు. హరితహారం అమలు, పచ్చదనం పెంపు, అటవీ రక్షణ, అదే సమయంలో వివిధ రకాల అభివృద్ది పథకాలకు అటవీ శాఖ అనుమతులతో తోడ్పాటు ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ అంశాల పట్ల ముఖ్యమంత్రితో పాటు అటవీ శాఖ మంత్రి జోగు రామన్నల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, అందువల్ల గడువులోగా పనులు పూర్తి కావల్సిందేనని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మలిదశ అవెన్యూ ప్లాంటేషన్ ( రోడ్లకు ఇరవైపులా చెట్లు) మొదలు పెట్టాలని, ఇందుకోసం ప్రతీ అటవీ డివిజన్ కు లక్ష చొప్పున పెద్ద మొక్కలను సిద్దం చేయాలని టార్గెట్ గతంలోనే విధించారు. కొన్ని జిల్లాల్లో ఈ పనుల్లో జాప్యంపై పీసీసీఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పి పనులు ఆలస్యం చేస్తే డీ ఎఫ్ ఓ, ఎఫ్.డీ.ఓలతో పాటు కింది స్థాయి సిబ్బందిపైనా చర్యలు తప్పవన్నారు.

పట్టణ ప్రాంతాలతో పాటు ప్రతీ డివిజన్ లో కొత్తగా పది కిలో మీటర్ల చొప్పున ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వచ్చే హరితహారం కోసం నర్సరీలను తగిన సంఖ్యలో సిద్దం చేయాలన్నారు. కొత్తగా మొక్కలు నాటే ప్రాంతాలను,స్థలాలను గుర్తించి వాటిని జియో రెఫరెన్స్ చేయాలని తెలిపారు.  రోడ్ల విస్తరణ, మిషన్ బగీరథ, సాగునీటి ప్రాజెక్టుల కోసం పెండింగ్ లో ఉన్న అటవీ అనుమతులను తక్షణం పూర్తి
చేయాలన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గూడేలకు విద్యుత్, రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని, ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు సంకల్పించిందని, ఆశాఖలతో సమన్వయం చేసుకుని అటవీ శాఖ సహకరించాలని ఉన్నతాధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల ఆక్రమణలపై నిరంతరం నిఘా ఉంచాలని, ప్రతీ డివిజన్ లో అగ్ని ప్రమాదాల నివారణకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పీసీ ఎఫ్ తో పాటు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్ ) డాక్టర్ మనోరంజన్ భాంజా, అదనపు అటవీ సంరక్షణ అధికారులు రఘువీర్, మునీంద్ర, లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, శోభ, సునీల్ కుమార్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *