
లోక్ సభ చరిత్రలో నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది బీజేపీ ప్రభుత్వం.. తమ ప్రతిష్టాత్మక భూసేకరణ, బీమా తదితర బిల్లులు పాస్ కాకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ ఎంపీలను ఒకరి కాదు ఇద్దరు కాదు లోక్ సభ చరిత్రలోనే 25 మంది సభ్యులను స్పీకర్ మీరాకుమార్ సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం బీజేపీ అసహాయతను నిరూపించింది..
కాగా కాంగ్రెస్ ఇంత మంకుపట్టుగా లోక్ సభను స్తంభింప చేయడానికి కారణం.. లలిత్ మోడీ వివాదంలో అవినీతికి పాల్పడ్డ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే , వ్యాపం కుంభకోణంలో 50 మంది చావుకు కారకుడైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామాను డిమాండ్ చేయడమే..
అవినీతిరహితమంటూ గద్దెనెక్కి ఒక్కొక్కరుగా అవినీతి కూపంలో ఇరుక్కుపోతున్న భీష్ముడిలా మౌనంగా వెళ్లదీస్తున్న ప్రధాని వైఖరిని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గట్టిగానే నిలదీసింది.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి ‘చీకటిరోజు’ అని ప్రకటించారు. వెంకయ్య నాయుడు సోనియా వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇందిర, కాంగ్రెస్ ఎమర్జెన్సీ కన్నా మేం ప్రజాస్వామ్యంగా చేశామని చెప్పుకొచ్చారు.
కాగా 25మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పై నిరసిస్తూ 9 మంది ప్రధాన ప్రతిపక్షాలు లోక్ సభకు గైర్హాజరు కావాలని నిర్ణయించడం బీజేపీకి ఇరుకునపడ్డట్టైంది..