
సీఎం కేసీఆర్ రెండో విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాళ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రసంగిస్తారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సరికొత్త పథకాలు, పారిశ్రామిక విధానంతో కొత్త పుంతలు తొక్కిస్తున్న పాలనపై కేసీఆర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. అందుకే ఈ సదస్సుకు కేసీఆర్ కు ఏకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది..
కాగా ప్రపంచ ఎకనామిక్ ఫోరం లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత చైనా, జపాన్ ,కొరియాల్లో పర్యటించి పెట్టుబడిదారులతో మాట్లాడి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరునున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానంను విశ్వవ్యాప్త ప్రచారం కల్పించడానికే సీఎం కేసీఆర్ దాదాపు 25 మంది వ్యాపారులు, అధికారులతో పయనమయ్యారు. కేసీఆర్ ఇవాళ ఉదయం దాదాపు 2 కోట్లతో సపరేట్ గా బుక్ చేసిన విమానంలో చైనా బయలు దేరి వెళ్లనున్నారు.