అచ్చేదిన్.. పోయేదిన్..

nitish-kumar-modi-dna.jpg.image.160.84

ప్రధాని మోడీకి రెండో పరాజయం.. 2014 ఎన్నికల్లో భారతదేశంలో ఎవరి మోతాదు లేకుండా బీజేపీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోడీ.. నాటి హామీలు మరిచిపోయారు. ప్రసంగాలతో, విదేశీ పర్యటనలతో దేశ ప్రజలకు అచ్చేదిన్ లంటూ మాయమాటలతో కప్పిపుచ్చారు. ఫలితం చూస్తున్నారు..

వరుసగా ఢిల్లీలో కేజ్రీవాల్ చేతిలో మోడీ ఓడిపోయారు. ఇప్పుడు బీహార్ లో నితీష్ చేతిలో చావుదెబ్బతిన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో జేడీయూ 150 సీట్లకు పైగా గెలుస్తుండగా.. బీజేపీ 80 సీట్లకే పరిమితమై ఓటమి దిశగా పయనిస్తోంది..

నల్లధనం తెస్తానని.. దేశప్రజలందరికీ 15 లక్షల చొప్పున పంచిపెడతానని చెప్పిన పెద్దమనిషి మోడీ.. ఆ తరువాత మాట మార్చాడు. అది సాధ్యంకాదని నాలుక మడతేశాడు. ఏపీకి ప్రత్యేక హోదా అని తిరుమల ఎంకన్న సాక్షిగా చెప్పి దారుణంగా మోసం చేశాడు..

ఇదంతా దేశ ప్రజలు గమనించారు. బీహార్ ఓటర్లు ఈ మాటల మరాఠిని ఛీత్కరించారు.  లాలూ అవినీతి పరుడైనా బీహార్ ఎన్నికల్లో గెలిపించారంటే బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఏస్థాయిలో ప్రబలిందో అర్థం చేసుకోవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *