
‘సినిమాలో అఖిల్ డ్యాన్స్ చూసి షాకయ్యాను. ఇంటికెళ్లాక ఐదు నిమిషాలు అఖిలేనే చూస్తుండిపోయాను. నా ఇంట్లో ఇంత మంచి డ్యాన్సర్ తిరుగుతున్నాడా.? అనిపించింది.. ఎప్పుడు నేర్చుకున్నావ్ రా అని అకిల్ ను అడిగాను.. కాగా సినిమా మొత్తం బాగా వచ్చిన ఒక ఎపిసోడ్ గ్రాఫిక్స్ వర్క్ బాగా లేదు.. అది సినిమాలో ఇంపార్టెడ్ ఇష్యూ.. అందుకే మళ్లీ గ్రాఫిక్స్ చేసి విడుదల చేద్దామనుకున్నాం.. ’ ఆ ఉద్దేశంతోనే అఖిల్ సినిమా విడుదల వాయిదా వేశాం.. అన్నారు సినీ హీరో నాగార్డున..
రాజమౌళి గ్రాఫిక్స్ కోసమే ఏడాదిన్నర వెయిట్ చేశాడు. ఆ సినిమా భారత దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.. అలాంటప్పుడు అకిల్ మొదటి సినిమాకు కాంప్రమైజ్ కావద్దనే సినిమా విడుదల వాయిదా వేశాం.. అభిమానులకు బాధగానే ఉన్న క్షమించండి.. ప్లీజ్ అన్నారు నాగార్జున..