Breaking News

అఖిల్ సినిమాలో పవన్ కళ్యాన్?

Hats-off-to-Powerstar--Akkineni-Akhil-1734

హైదరాబాద్, ప్రతినిధి : అక్కినేని నాగార్జున తనయుడు ‘అఖిల్‌’ను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవల సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిత్రాన్ని వివి వినాయిక్ డైరెక్ట్ చేస్తుండగా, నటుడు ‘నితిన్’ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

నాగార్జున.. పవన్ కళ్యాణ్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడంట. ఎందుకంటే ఈ సినిమాలో మలుపుతిప్పే కీలక పాత్ర కోసం ‘పవన్ కళ్యాణ్’ ఎంపిక చేశారని టాక్. మొదట సీనియర్ నటుల చేత చేద్దామని అనుకున్నారు. తరువాత ‘పవన్’ నటిస్తేనే బాగుంటుందని టాక్ వినిపించింది. చివరకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన నితిన్ తండ్రి ఓ సూచన అందచేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నటింపచేసేలా చూడాలని వివి వినాయక్ కు ఈ బాధ్యతను అప్పచెప్పారని వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ నటిస్తారా ? లేదా ? అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *