అక్షరాలతో సమానమైన జ్ఞానాన్ని అందించేదే ఫోటోగ్రఫీ:ఈటెల

175వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రెస్ భవన్ లో బుధవారం జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ర్ట ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పేదలందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు  అందేలాకృషి చేస్తానన్నారు. ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థల సంఖ్యకు అనుగూణంగా టీచర్ల కేటాయింపు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఫోటో గ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. జడ్సి చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఫోటో గ్రాఫర్ల పాత్ర కీలకమైందన్నారు. ఫోటో జర్నలిస్టల సమస్యల సరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఫోటో జర్నలిస్టులు ఎదుర్కున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫోటో జర్నలిస్టులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఫోటోజర్నలిస్టు సంఘం నాయకులు మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులకు హెల్త్ కార్డులతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్య్రక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియూడబ్ల్యూజే) రాష్ర్ట అధ్యక్షులు నగునూరి శేఖర్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు అయిలు రమేష్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు తాడూరు కరుణాకర్, జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయ సింహారావు, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి ప్రభుదాస్ యాదవ్, ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోషియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సుకుర్, కార్యదర్శి సంతోష్ సింగ్, డీపీఆర్వో ప్రసాద్,  జడ్పి వైస్ చైర్మన్ రాజిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కట్ల సతీష్, రఘువీర్ సింగ్, సిద్ధం వేణు, పలువురు జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు తదితరులు పాల్గొన్నారు.

ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మంత్రి ఈటెల రాజేందర్

ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మంత్రి ఈటెల రాజేందర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.