అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

హైదరబాద్ (పిఎఫ్ ప్రతినిధి): హైదరాబాద్ లో ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ లకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో అక్రమంగా నిర్మించిన భనాలను క్రమబద్ధీకరించుకోవాలని లేకుంటే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందుకోసం అక్టోబర్ 28ను కటాఫ్ తేదీగా నిర్ణయించిన ప్రభుత్వం రెండు నెలల పాటు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడానికే ఈ రకమై న నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తలసాని వివరించారు. దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి ఆరు నెలల పాటు దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు చేపడితే భారీ ఎత్తున జరిమానా విధించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మురికి వాడల్లో ప్రతి చదరపు మీటరు రూ.5 చొప్పున వసూలు చేయనున్న ప్రభుత్వం. రూ.10 వేలు చెల్లించి ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. బిఆర్ జిఎస్ క్రమబద్ధీకరణ ఛార్జీలు ప్రతి 600 చదరపు మీటర్లకు రూ.12500, 601 నుంచి 1200 చదరపు మీటర్లకు రూ.25 వేలు, 1201 నుంచి 20000ల చదరపు మీటర్లకు రూ.40000ల చదరపు మీటర్లకు రూ. 40000, 20000ల చదరపు మీటర్లకు పైన ఉంటె రూ. 60వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ ఆర్ జిఎస్ క్రమబద్దీకరణ ఛార్జీలు ప్రతి 100 చదరపు మీటర్లకు రూ.200, 101 నుంచి 200 చదరపు మీటర్లకు రూ.400,  301 నుంచి 500 చదరపు మీటర్లకు రూ. 600, 500 చదరపు మీటర్లకు పైన ఉంటె రూ. 750 చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గృహ సముదాయాలకు, వాణిజ్య సముదాయాలకు వేరు వేరుగా ధరలు నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *