
కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): జిల్లాలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వ్లహించాలని జిల్లా ఎస్సీ డి జోయల్ పోలీసు అధికారులను ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. కేసుల దర్యాప్తులను వేగవంతం చేయాలని, దర్యాప్తులపై అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. రాబోయే పోలీసు ఉద్యోగాల్లో గ్రామీణ యువతీ, యువకులు ఎక్కువగా నియమకం అయ్యేలా ఉచిత శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసు అధికారులు యువతలో నూతనోత్సాహాన్ని నింపే విధంగా కార్యక్రమాలు రూపొందించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న దసర, దీపావళి పండుగల్లో ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్సీ బి జనార్ధన్ రెడ్డి, ఓఎస్ డిఎల్ సుబ్బరాయుడు, జిల్లాలోని వివిధ సబ్ డివిజన్లకు చెందిన డిఎస్సీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.