
ప్రముఖ దర్శక, నిర్మాత గుణశేఖర్ గుణా వర్క్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రుద్రమదేవి’ సెప్టెంబర్ 4 అంటే ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రావస్సిఉండే, అయితే విడుదలను అక్టోబర్ 9కి మార్చారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ విడుదల తేదీని మారినందుకు క్షమించాలని 3డీ టెక్నికల్ వర్క్స్ లో జరిగిన జాప్యం కారణంగానే రిలీజ్ డేట్ వాయిదా వేయవలసి వచ్చిందన్నారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో ఒకేసారి సినిమాను విడుదల చేస్తున్నామన్నారు.