అక్కడ నువ్వు ఏలుకో-ఇక్కడ నేను ఏలుకుంటా: గట్టి పునాదులు వేసుకుంటున్న ఇద్దరు చంద్రులు

అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ఇద్దరు చంద్రులు గట్టి పునాదులు వేసుకుంటున్నారు. 2014లో అధికారం చేపట్టిన తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ సిఎం ఎన్. చంద్రబాబు నాయుడు లు ఆయా రాష్ట్ర్రల్లో తిరుగులేని శక్తులుగా ఎదుగుతున్నారు. తెలంగాణ లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్న కేసీఆర్ మరో పక్క ఇతర పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ప్రతి పక్షాల అడ్రస్ గల్లంతు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే ‘‘వార్’’వన్ సైడ్ అనే టాక్ తెలంగాణ లో ఏర్పడింది. దీంతో ఇతర పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరదలా వచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. ఇప్పుడు కాంగ్రేస్ కూడా క్రమ క్రమంగా ఖాళీ అవుతుంది. టీఆర్ఎస్ లో తప్ప ఏ పార్టీ లోను తమకు భవిష్యత్ లేదని నాయకులు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నారు. రెండు మూడు టర్మలు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా కేసీఆర్ పార్టీని పటిష్ట పరుస్తున్నారు. ఇటు పార్టీని అభివృద్ధి చేస్తూనే అటు ప్రజాబలం గల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. 2019, 2024 ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ అధికారం చేపట్టేలాగా ఇప్పటినుంచే కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు.

chandra babu

ఇది ఇలా ఉండగా తెలంగాణ లో చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు వ్యూహం రూపొందించుకున్నారు. ఒక వైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు నూతన రాజధాని నిర్మాణం చేసి ప్రజల ప్రశంసలు అందుకోవాలనే ధృడ సంకల్పంతో ఉన్నారు. తమకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలను టిడిపి లో చేర్చుకుంటూ వైసిపిని ఖాళీ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు పర్యాయాలు తిరిగి అధికారం చేపట్టాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ‘సో’అక్కడ నువ్వు ఏలుకో ఇక్కడ నేను ఏలుకుంటా అని ఇద్దరు చంద్రులు ముందుకు సాగుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *