అకాల వర్షంతో అపార నష్టం

కరీంనగర్ , మెదక్ జిల్లాల్లో మంగళవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. ఈదురుగాలులు, వడగండ్ల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. మెరుపులు, ఉరుములు భయోత్పాతాన్ని సృష్టించాయి. రెండు జిల్లాల్లో కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని మామిడి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జగిత్యాల, మెట్ పల్లి మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి వచ్చిన మొక్కజొన్న, పసుపు తడిచి ముద్దయ్యాయి. సైదాపూర్ మండలంలో భారీ వడగండ్లు పడ్డాయి. ఒక్కోటి మామిడి కాయంత సైజులో ఉన్నాయి. ఈ ధాటికి వరి పంట నాశనమైంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈదురుగాలలకు  కళాశాల గోడ కూలి  ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *