అంబేద్కర్ స్టేడియంను సందర్శించిన విజిలెన్స్ అధికారి అలిరఫత్

కరీంనగర్: రాష్ట్ర్ర పర్యటక, యువజన, సాంస్కృతిక క్రీడల శాఖలకు విజిలెన్స్ అధికారి మహమ్మద్ అలిరఫత్ గురువారం అంబేద్కర్ స్టేడియంను సందర్శించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా పురావస్తు శాఖ మ్యూజియం, అంబేద్కర్ స్టేడియం, స్టెప్ కార్ ఆఫీస్, ఎల్.ఎం.డి. సందర్శించారు. పర్యటక శాఖ నిర్వహిస్తున్న ధర్మపురి వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరంలో హరిత హోటల్లలో అక్యుపెన్సి రేటు పెంచాలని తెలిపారు. అంబేద్కర్ స్టేడియంలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని తెలిపారు. పర్యటక రంగాన్ని లాభదాయకంగా మార్చేందుకు తీసుకోవలసిన చర్యల గురించి టూరిజం అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఎల్.ఎం.డి. డ్యాంను సందర్శించి బోటింగు గురించి అడిగి తెలుసుకున్నారు. స్టెప్ కార్ కార్యాలయం సందర్శించి యువతకు అందిస్తున్న రుణాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ బాగుందని తెలిపారు. అంబేద్కర్ స్టేడియంలో క్రీడాకారులకు సౌకర్యాలను మెరుగు పరచాలని తెలిపారు. వంటగదిని పరిశీలించారు. క్రీడా పాఠశాల హస్టల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, స్టెప్ కార్ సి.ఇ.ఓ. మహ్మద్ అలి, డి.ఎస్.డి.ఓ. డి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ambetker stadium.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *