
#రెండింటిలో ఒక ప్రతిపాదనకు ఒకే చెప్పిన కమిటీ
#అంతిమనిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ దే
#పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన డిజైయిన్ అసోసియేట్స్
#అంబెడ్కర్ విగ్రహాకమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం
#ఉపముఖ్యమంత్రి కడియం అధ్యక్షతన జరిగిన సమావేశం
#హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్ర రాజధాని నగరంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నెలకొల్పనున్న భారతరాజ్యాంగనిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహ ఏర్పాట్లకై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఛైర్మెన్ గా విగ్రహకమిటీ నియమించిన విష్యం విదితమే. కమిటీ ఏర్పాటు అనంతరం అధ్యయనానికి గాను సిక్కిం,ఛైనా తదితర ప్రాంతాలలో పర్యటించడంతో పాటు దేశరాజధాని ఢిల్లీకి చెందిన డిజైయిన్ అసోసియేట్స్ కు ఏర్పాట్ల డిజైయిన్ ను అప్పగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం అంబెడ్కర్ విగ్రహకమిటీ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిజైయిన్ అసోసియేట్స్ కంపెనీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు రకాల డిజైయిన్ లను పవర్ పాయింట్ రూపంలో ప్రజెంటేషన్ చేయడంతో కమిటీ అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదట రెండింటిలో ఒకదానిని ఫైనల్ చెయ్యాలని నిర్ణయించారు. అయితే అంతిమనిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని విగ్రహాకమిటీ తీర్మానించింది. డిజైయిన్ అసోసియేట్స్ రూపొందించిన డిజైయిన్ లకు తుది మెరుగులు దిద్దిన కమిటీ జె ఎన్ ఎఫ్ ఏ యు కు చెంది శిల్పి బోళ్ల శ్రీనివాస రెడ్డి రూపొందించిన విగ్రహాలను డిజైయిన్ లలో పెట్టి చూడాలని నిర్ణయించారు. విగ్రహాకమిటీ ఛైర్మెన్ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,లోక్సభ సభ్యులు బాల్క సుమన్,పసునూరి దయాకర్,శాసనసభ్యలు రసమయి బాలకిషన్ లతో పాటు యస్.సి అభివృద్ధి శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా,పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్,సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.యస్ ప్రవీణ్ కుమార్, యస్.సి అభివృద్ధి శాఖా డైరెక్టర్ కరుణాకర్ రోడ్లు భవనాల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతి రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణ, జె ఎన్ ఎఫ్ ఏ యు కు చెందిన శిల్పి బోళ్ల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.