అంబరాన్నంటిన హోళీ సంబరాలు

holi2

తెలుగు రాష్ట్రాల్లో హోళీ వేడుకలు సంబరాన్నంటాయి. చిన్న పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా రంగులు పూసుకుని సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై యువతులు, యువకులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు ఇలా ప్రతి జిల్లాల్లో రంగుల హోళీలతో జనం సందడి చేశారు.

holi1

కరీంనగర్ లోని టవర్ సర్కిల్, విద్యానగర్, రాంనగర్ లలో జనం రోడ్ల మీదకు వచ్చి డిజే లు పెట్టుకుని డ్యాన్స్ చేశారు. కోడిగుడ్లు, టమాటాలు కొట్టుకుని సందడి చేశారు. కమాన్ దగ్గర యువత సందడి చేశారు.

జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసులు ఎస్పీకి రంగులు పూసి హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్ కు ఉద్యోగులు రంగులు పూసి డ్యాన్స్ చేశారు.

holi1

వివిధ పార్టీల నాయకులు సంతోషంగా హోళీ పండుగను జరుపుకున్నారు. రంగులు చల్లుకుని శుభాకాంక్షలు చెప్పారు. సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ల ఇంటి వద్ద రంగులు పూసుకుని హోళీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *