
హైదరాబాద్ : తెలంగాణ అవతరణ ముగింపు సంబరాలు అంబరాన్నంటాయి. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు జనం తండోపతండోపాలుగా హాజరయ్యారు. ఎలక్ర్టానిక్ పతంగులు ఆకాశంలో కనువిందుచేశాయి. ట్యాంక్ బండ్ విద్యుత్ వెలుగులతో జిగేల్ మంది.
ఈ వేడుకలకు గవర్నర్ దంపతులు, సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వేడుకలకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా హాజరయ్యారు. వేదికపై ఉన్న గవర్నర్ సీఎం లడ్డూ తినిపించారు. వేడుకలకు హాజరైన జనాలకు లడ్డూలను పంపిణీ చేశారు.