గ్వాటిమాలా లో ఓ యువతిని సజీవ దహనం చేసి తమ కర్కశత్వాన్ని నిరూపించుకున్నారు జనం.. వందల మంది చూస్తుండగానే ఈ ఆకృత్యం చోటుచేసుకోవడం గమనార్హం. గ్వాటిమాల దేశంలో ఆటవిక పరిపాలనకు నిదర్శనమీ చిత్రం.
ఓ హత్య కేసులో ప్రమేయం ఉందని ఈ 16ఏళ్ల బాలికను ఇష్టనుసారం కొట్టిన జనం అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆర్తనాదాలు చేస్తూ ఆమె కొట్టుకొని చనిపోతున్నా కరగలేదు కఠికజనం. గ్వాటిమాలాలోని రియో బ్రావో నగరంలో ఈ సంఘటన జరిగింది.