Breaking News

అందరు ఉన్నా అనాథగా రోడ్డు మీద మృతదేహం

dead-lady

కరీంనగర్, ప్రతినిధి : ఇద్దరు కొడుకులు సింగరేణి ఉద్యోగులు.. ఇద్దరికీ 50 వేల పైనే జీతం .. మరో కొడుకు చేనేత సహకారం సంఘంలో పనిచేస్తాడు. అతడిది మంచి జీవనమే… వారితో ఆమె ఇద్దరు కూతుళ్లు..అందరిని బాగా చదివించి మంచి స్థితికి చేర్చింది ఓ అమ్మ.. కానీ ఆ ముదుసలి చనిపోతే రోడ్డే దిక్కయింది. అందరూ వదిలివేయడంతో రోడ్డు మీద అనాథే పడి ఉంది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన దాసరి కాంతమ్మ(80) సోమవారం కూతరు గ్రామమైన హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో మృతిచెందింది. దీంతో కూతురు కాంతమ్మ స్వగ్రామమైన నర్సింగాపూర్ కు సాయంత్రం తీసుకువచ్చింది. తల్లి చనిపోయిన విషయం తెలిసినా ఇద్దరు సింగరేణి ఉద్యోగులైన కొడుకులు రాలేదు. అందరూ ఉన్న అనాథగా పడి ఉన్న ఆ వృద్ధిరాలి మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు చందాలు వేసి దహన సంస్కారాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ ఐ కొడుకులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెద్ద కొడుకు తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తానని చెప్పి మార్గమధ్యంలో తాటిచెట్ల వద్ద వదిలేసి పోయాడు.

దీంతో కొడుకు కాదని పోయినా మానవతా దృక్పథంతో ప్రజలంతా కలిసి మంగళవారం దహనసంస్కరాలు చేస్తామని చెప్పారు. పాపం అందరూ ఉన్నా కాంతమ్మ.. ఇప్పడు ఎవరూ లేనిదిగా అనాథగా చెట్ల కింద పడి ఉండడం అందరినీ కలిచివేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *