
‘చూడప్ప సిద్దప్ప.. సింహం గడ్డం గీసుకోదు.. నే గీసుకుంటా అంతే తేడా’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్ ఇది. కానీ నేటి ట్రెండ్ మారింది. గడ్డమే ఇప్పుడు ఫ్యాషన్.. ప్రపంచకప్ లో ఆడుతున్న భారత ఆటగాళ్లు గడ్డాలు భారీగా పెంచి మిగితా దేశాల క్రికెటర్ల కంటే విభిన్నంగా కనిపిస్తున్నారు. సెంచరీలు కొట్టినప్పుడు కోర మీసాలు మెలేస్తూ సవాలు విసురుతున్నారు. మిగితా దేశాల క్రికెటర్లు మాత్రం కేవల జుట్టు వరకే తమ ఫ్యాషన్ ను కొనసాగిస్తున్నారు. గడ్డం మాత్రం నీట్ గా షేవ్ చేసుకుంటున్నారు. గడ్డం ఇప్పుడు అందానికి అడ్డం కావట్లేదు..
వీళ్లేకాదు మన సినీ హీరోలు గడ్డం ఫ్యాషన్ ను అప్పుడప్పుడు పాటిస్తున్నారు. సినిమాల్లో నీట్ గా ఉండే పవన్ కళ్యాణ్ బయట మాత్రం గడ్డంతోనే కనిపిస్తారు. ఇక మహేశ్ టక్కరిదొంగలో గడ్డం పెంచి మరింత స్మార్ట్ గా కనిపించాడు. ఈ మధ్యే రాజశేఖర్ గడ్డం భారీగా పెంచి ముఖం కూడా కనిపించనంతగా గడ్డం గ్యాంగ్ తీసి అలరించాడు. ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్, రానా ఇలా ప్రతిఒక్కరూ ఇప్పుడు గడ్డంతో సినిమాల్లో దర్శనమిస్తున్నారు. అదీ ఇప్పడు లేటెస్ట్ ట్రెండ్ గడ్డమే..