Breaking News

అంతా రాహులే చేశారు..

jayanthi-natarajan-rahul-gandhi

-కాంగ్రెస్ జయంతినటరాజన్ రాజీనామా
ఢిల్లీ, ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పోతూ పోతూ కాంగ్రెస్ విధానాలపై లేఖ రాసి వివాదాలకు ఆజ్యం పోశారు. రాహుల్ గాంధీ తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖలో జోక్యం చేసుకొని అనుమతులు ఇప్పించారని.. అయినా తనను చాలా సార్లు పార్టీ అవమానించిందని పేర్కొన్నారు. తాను చేరినప్పుడు కాంగ్రెస్ కు.. ఇప్పుడున్న కాంగ్రెస్ కు చాలా తేడా ఉందన్నారామె. పారిశ్రామిక వేత్త అదానీ ప్రాజెక్టు దస్త్రంపై కూడా రాహుల్ ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు.

భాజపాలో చేరిక ప్లాన్.?
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జయంతి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇటీవలే ఆమె అమిత్ షాతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.

ఇక ఎన్నికల్లో ఓడిపోయి కూనరిల్లుతున్న కాంగ్రెస్ కు జయంతి రాజీనామాతో మరింత కృంగదీసినట్లు అయింది. అసలే వివాదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు ఇలా రోజుకో నేత రాజీనామాతో మరింత చిక్కులు ఎదురవుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *