అంతా దోపిడే

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఎవరైనా పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు పయణమవుతున్నారా… పయనమయ్యేందుకు బస్టాండ్ల దుకాణ సముదాయాలలో మంచీనీటి బాటిళ్లు కొనుక్కుంటున్నారా… అయితే జాగ్రత్త మరి. అది మంచి కంపెనీకి చెందిన మంచినీటి బాటిల్ అనుకునేరు కంపెనీ పేరుతో ఉండే నకిలీ బాటిల్. అచ్చం అలాగే ఉండే స్టిక్కర్లను అంటించి వాటిలో మామూలు నీటిని నింపుతూ సొమ్ము చేసుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారనేది నమ్మలేని నిజం. ఇది ఒక్క హైదరాబాదో, కరీంనగరో లేదా మరేదో జిల్లాల్లో అనుకునేరు రాష్ర్టంలో ప్రతి బస్టాండ్ల లో జరుగుతున్న తంతు ఇదే. అయితే అచ్చం కంపెనీలాంటి స్టిక్కర్లతో పాటు బాటిళ్లు కూడా అదే మాదిరిగా ఉండటంతో ప్రజలు మోసపోయి వాటిని కొంటున్నారు. వాటి ధరలు సైతం మామూలు కంటే 25 నుంచి 50 శాతం వరకు అధనంగా వసూలు చేస్తున్నారు. ఈ అధిక ధరలకు విక్రయించడం ఒక్క బస్టాండ్లకు మాత్రమే సొంతం కాదు సినిమా హాళ్లలో సైతం ఈ తరహా దోపడి నిత్యం చేస్తూనే  ఉన్నారు. కూల్ డ్రింక్ లు, పాప్ కార్న్. చిప్స్ ఇలా ఒక్కటేంటి అందులో అమ్మే ప్రతి తిను బండారం కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సాధారణంగా ఒక లీటర్ కిన్ లే, అక్వాఫినా వాటర్ బాటిల్ 20 రూపాయలు విలువ చేస్తే, దుకాణ దారులు విక్రయించేది మాత్రం రూ. 25 నుంచి 30 రూపాయలకు. సాధారణంగా ఒక సినిమా హళ్లో 16 రూపాయలు విలువ చేసి కూల్ డ్రింక్ ను 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇది ఈ మధ్యలో జరుగుతున్న తంతు కాదు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. దీనిపై పలుమార్లు పలు సినిమా థియేటర్లలో పలు మార్లు గొడవలు జరిగినా వాటిపై స్పందించే వారే కరువయ్యారు. ఒక వేళ కంపెనీకి సంబంధించిన నీటినే అడిగిన వారికి ధరలను మరింత పెంచుతూ వారితో వాగ్వివాదాలకు దిగుతున్నారు. ఇందుకు ఉదాహరణగా శనివారం నాడు కరీంనగర్ లోని మమత థియేటర్ లో పలుమార్లు ప్రేక్షకులతో వాదోపవాదాలు జరిగాయి. ఈ గొడవ పొలిటికల్ ఫ్యాక్టరీ ప్రతినిధి కంటపడింది. అయితే ఈ దుకాణ సముదాయాలపై ఎప్పటికప్పుడుఅధికారులు దాడి చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారి వద్ద నుంచి మామూళ్లు దండుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

12011196_1021415307909310_5495136817770258084_n 12046945_1021414504576057_7978438226331800326_n