అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు

కరీంనగర్ : వ్యసనాలకు బానిసలై జల్సాల కోసం చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు, దోపిడీలు, రాత్రి దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను కరీంనగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం పాత దాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన పల్లెపు రాజేశ్ (25), నిజామాబాద్ జిల్లా ఆర్మూరు  మండలం పెర్కిల్ గ్రామానికి చెందిన అతని బామ్మర్ధి ల్లెపు రాజు (25)లు రంగారెడ్డి జిల్లా లాలాపేట కేంద్రంగా ఏర్పరుచుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరికి రంగారెడ్డి జిల్లా సారంగాపూర్ మండలం గణేష్ పల్లికి చెందిన సూర సాయిలు అలియాస్ శ్రీకాంత్ (25)తో జూదం ఆటలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి దొపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత నెల లో వేములవాడ మండలం నాంపల్లి వద్ద జరిగిన దోపిడీని తీవ్రంగా పరిగణించిన జల్లా పోలీసు యంత్రాంగం వేములవాడ ఇన్స్ పెక్టర్ మాధవి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సోదాలు చేస్తుండగా శనివారం ఉదయం బైక్ వస్తున్న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *