Breaking News

అంతర్జాతీయ వేదికపై వీవీఎస్ లక్ష్మన్ నోట.. తెలంగాణ మాట..

1471243_WIDE_FULLSCREEN

తెలంగాణ ఉద్యమం.. కొత్త రాష్ట్రంగా ఏర్పడడంలో తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటం అసమానమైనది.. సీఎం కేసీఆర్ పోరాటం మాటల్లో వర్ణించలేనిది.. అంతటి పోరాటంతో టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ స్ట్రాటజీకి దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తూనే ఉంటారు.. తెలంగాణ అంటే కేసీఆర్, టీఆర్ఎస్ అని అంతా భావించేలా పాలన సాగిస్తున్నారు సీఎం కేసీఆర్..

ఇప్పుడు ప్రపంచకప్ టీట్వీంటీ జరుగుతున్న వేళ తెలంగాణ ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ వేదికపై ఇనుమడించింది.. ప్రపంచకప్ టీట్వంటీ మ్యాచ్ లో భాగంగా చేసే వ్యాఖ్యతల కామెంట్రీలో హైదరాబాదీ  కు చెందిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మన్ పాల్గొంటున్నారు. స్టార్ స్పోర్ట్స్ లో అంతర్జాతీయంగా లైవ్ కొనసాగుతుండగా వ్యాఖ్యత హర్షభోగ్లే వీవీఎస్ పై కామెంట్ చేశారు. ఈరోజు మీరు వేసుకున్న గులాబీ రంగు కలర్ ఫుల్ గా ఆకర్షణీయంగా ఉందని కితాబిచ్చారు. దీంతో మైక్ అందుకున్న వీవీఎస్ లక్ష్మన్ ‘ఈ రంగు నా సొంత రాష్ట్రం తెలంగాణ బ్రాండ్ అని.. అందుకే ఇది తనకు ఇష్టమని ’ అన్నారు. దీంతో వీవీఎస్ కు  తెలంగాణ అభిమానం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *