అంతరాష్ట్ర ట్రాక్టర్ల ఘరానా దొంగ కొత్తపల్లి రాజు @ బానోతు రాజు అరెస్ట్…

గత 13 సంవత్సరాలుగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో వరుసగా ట్రాక్టర్ల దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర ఘరానా దొంగ కొత్తపల్లి రాజు @ బానోతు రాజుని అరెస్ట్ చేసిన కరీంనగర్ సీసీఎస్ పోలీసులు…

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజు చేడు వ్యాసనాలతో,జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తూ, బార్యాపిల్లలను వదిలి,మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కి వెళ్లి,ఎవరికి దొరకకుండా ఉంటూ అక్కడ రెండవ పెళ్లి చేసుకొని బానోతు రాజు గా పేరు మార్చుకొని అక్కడ కూడా
ఉండకుండా దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉండి,తరుచుగా తన రూపాన్ని,ఉండే ప్రాంతన్నీ మారుస్తూ, దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతుండగా కరీంనగర్ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అతనిని వలపన్ని పట్టుకొని, విచారించి,దొంగ సొత్తును రికవరీ చేసి,రిమాండ్ కి తరలించడం జరిగింది…

నేరం చేయు విధానం…

నిందితుడైన కొత్తపల్లి @ బానోతు రాజు చెడు వ్యసనాలకు అలవాటు పడి,ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించి,వాటితో జల్సాలు చేయాలని, అందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని తనకు డ్రైవింగ్ తెలిసి ఉండడంచేత ఎలాగైనా ట్రాక్టర్లను,ట్రాలీలని,వాటర్ ట్యాంకర్లు దొంగతనం చేసి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేయదలుచుకున్నాడు..అట్టి క్రమంలో నిందితుడు బస్సుల్లో,రైళ్లలో దూరప్రాంతలకు ప్రయాణించి ఆ ఏరియాలల్లో విసృతంగా తిరుగుతూ ఒంటరిగా ఉంచిన ట్రాక్టర్లను,ట్రాలీలని,వాటర్ ట్యాంకర్లు గుర్తించి,పగటి సమయంలో వాటిపై నిఘా ఉంచి, ఆ ఏరియాలల్లోనే వుండి రాత్రి సమయంలో ఎవరికి కనపడకుండా తన వద్దగల దొంగ తాళలతో అట్టి వాహనాలను దొంగిలించి చాలా దూరం తరలించి ఎవరు గుర్తించని ప్రదేశాలలో వాటిని అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఎవరికి దొరక కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు…

పట్టుబడిన విధానం…

గత కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మరియు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వాటర్ ట్యాంకర్లు దొంగిలించబడడం జరుగగా, గౌరవ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అట్టి నిందితులను పట్టుకోవడం కోసం అన్వేషిస్తూ,అనుమానితులపై నిఘా ఉంచుతూ విచారణ జరుపు క్రమంలో పక్క సమాచారం మేరకు సీసీఎస్,కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా కరీంనగర్ లోని పద్మనగర్ లో గల బైపాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అటుగా ట్రాక్టర్,వాటర్ టాంకర్ తో వచ్చిన నిందితుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అట్టి నిందితుడిని వలపన్ని,చాకచక్యంగా పట్టుకొని విచారించగా తను చేసినటువంటి నేరాలను అన్నింటిని అంగీకరించడం జరిగింది….

రాజు @ గతం అంత దొంగతనాల మయం…

నిందితుడైన రాజు చేడు వ్యసనాలకు అలవాటు పడి,గత 13 సంవత్సరాలనుండి దొంగతనాలనే వృత్తిగా చేసుకొని జీవిస్తూ,ట్రాక్టర్లను,ట్రాలీలని,వాటర్ ట్యాంకర్లను దొంగతనాలు చేస్తూ,2005 నుండి ఇప్పటివరకు దాదాపు 80 నుంచి 100 కేసులలో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లోని వివిధ పోలీస్ స్టేషన్ లలో అరెస్ట్ అయ్యి జైల్ జీవితం గడిపి వచ్చిన కూడా తన యొక్క పద్దతి మార్చుకోకుండా మళ్ళీ వరుసగా ఇదే తరహా దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడు…రెండు రాష్ట్రాలలో ఈ తరహా దొంగతనాలు జరిగితే వెంటనే రాజు గుర్తొస్తాడంటే ఇతని నేర జీవితం ఎలాంటిదో అర్థం అవుతుంది….జైల్ నుంచి వచ్చిన ప్రతిసారి మళ్ళీ దొంగతనాలు చేస్తూ,పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ ఉండేవాడు…చాలా సార్లు ఇతన్ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది…. మద్యానికి బానిసై…స్త్రీల వ్యామోహంలో పడి…కుటుంబానికి దూరమై… నిందితుడైన రాజు దొంగతనాలు చేస్తూ,వచ్చిన డబ్బులతో విపరీతంగా మద్యానికి బానిసగా తయారయ్యి,తన యొక్క భార్య పిల్లలను వదిలి ,స్త్రీ ల వ్యామోహంలో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేస్తూ,అవి అయిపోగానే మళ్ళీ దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తూ ఉండేవాడు…తద్వారా దొంగతనాలు మానకుండా చేస్తూనే ఉంటున్నాడు…ఎన్ని సార్లు జైల్ జీవితం గడిపిన తన జీవన శైలిలో మార్పులేకుండా పోయింది…. మారు వేషాలలో తిరుగుతూ…అడ్రసులు మారుస్తూ…మారుమూల పల్లెలు,తండాలే అడ్డాలుగా… నిందితుడైన రాజు ఒక ప్రాంతంలో అరెస్టు అయ్యి జైలుకి వెళ్లి వచ్చాక తన యొక్క పద్దతి మార్చుకోకుండా తిరిగి అలాగే దొంగతనాలు చేయాలని తన యొక్క రూపాన్నీ మారుస్తూ, తన అడ్రస్ లను కూడా వేరే ఊర్లకి మార్చి,నిఘా లేనటువంటి ముఖ్యంగా దూరప్రాంతాలైన పల్లెలని,తండాలని ఎంచుకొని అక్కడ మకాం ఏర్పాటు చేసుకొని దాన్ని కేంద్రంగా చేసుకుంటూ,ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ, దూరప్రాంతలకు వెళ్లి రాత్రి సమయాలలో వాహనాలను దొంగిలిస్తూ అక్కడికి తెచ్చుకొని,తర్వాత వాటిని అమ్ముకుంటు వచ్చిన డబ్బులతో వ్యాసనాలను తీర్చుకుంటున్నాడు….ఇలా మారుమూల ప్రాంతాలలో స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడ రేషన్ కార్డ్,ఓటర్ కార్డ్ లాంటి ఆధారాలను ఏర్పాటు చేసుకొని రాయితీలను కూడా పొందేవాడు… అక్కడ కూడా పట్టుబడితే మరల వేరే ప్రాంతానికి తన స్తావరాన్ని మార్చేవాడు…అక్కడ కూడా తన దొంగతనాలను ఆపకుండా,అదేవిదంగా చేస్తూ ఉండేవాడు… తెలంగాణలో దొంగిలించినవి ఆంధ్రకి…ఆంధ్రలోనివి తెలంగాణకి…. నిందితుడు దొంగిలించిన వాహనాలు పోలీసులకి పట్టుబడకుండా ఉండడం కోసం తెలంగాణ జిల్లాల్లో దొంగతనం చేసిన వాహనాలను ఆంధ్రలోని విజయవాడ,విశాఖపట్నం,ఉభయ గోదావరి,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలకు తరలించి అక్కడ అమ్మకం జరుపేవాడు… అలాగే ఆంధ్రలో దొంగిలించిన వాహనాలు తెలంగాణకి తెచ్చి ఇక్కడ హైదరాబాద్, నిజామాబాద్,సిద్దిపేట,కామారెడ్డి జిల్లాలలో అమ్మకం చేసేవాడు..తద్వారా పోలీసులకు అనుమానం రాదని,పట్టుబడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఈతరహలో దొంగతనాలు చేసిన వాహనాలు అమ్మి సొమ్ము చేసుకునేవాడు…అలాగే కొన్ని వాహనాలను ఇనుప సామాను దుకాణాలలో అమ్మడం చేత కొద్దీ రోజులకే వాటి ఆనవాలు పూర్తిగా లేకుండా పోయేవి…తద్వారా వాహనాల రికవరీ పోలీసులకు సవాలుగా మారుతుంది… పట్టుబడితే…సబ్సిడీ నాటకంతో బయటపడుతూ… నిందితుడు దొంగిలించిన వాహనాలను ఎవరు పట్టుకోకుండా ఉండడం కోసం వాటిపై నంబర్లను తొలగించి,కొత్త వాహనాల మాదిరిగా టిఆర్ నంబర్లను వేస్తూ యథేచ్ఛగా అట్టి వాహనాలు నడుపుకుంటూ తిరిగేవాడు…ఒకవేళ ఎవరైనా అనుమానంతో పట్టుకుంటే తనకు ప్రభుత్వం వ్యవసాయానికి సబ్సిడీ కింద ఇచ్చిందని వారిని నమ్మించి మోసం చేస్తూ తప్పించుకునేవాడు… ఇందుకు ఎత్తుగడగా తన ట్రాక్టర్లో డ్రైవర్ సీటు పక్కన రెండువైపులా సంబంధిత నాయకుల ఫోటోలను ఫ్రెమ్ చేసుకోని పెట్టుకునేవాడు…. నిందితుని నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు…

ccs police 1     ccs police 2

1.మాచారెడ్డి,చిల్లకల్లు కు చెందిన రెండు ట్రాక్టర్లు…
2.బోయినపల్లి మండలం కుదురుపాక కి చెందిన ఒక ట్రాలీ…
3.చిల్లకల్లు,సూర్యాపేట,మరిపెడ మరియు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్
పరిధికి చెందిన నాలుగు వాటర్ ట్యాంకర్లు…
మొత్తం విలువ దాదాపు 20,00,000/- ల రూపాయలు..

నిందితుని పూర్తి వివరాలు….
కొత్తపల్లి రాజు @ బానోతు రాజు s/o లక్ష్మణ్ @ లక్ష్మయ్య,40సం, కమ్మరి,R/o
కొండాపూర్ గ్రామం,ముస్తాబాద్ మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లా…

ప్రస్తుతం H.No.6-1-165,డోర్నకల్ గ్రామం & మండలం,మహబూబాబాద్ జిల్లా…
నిందితుడు చేసిన నేరాల యొక్క వివరాలు….
1.క్రైమ్.నం.44/18 u/s 379 ఐపిసి ఆఫ్ చిల్లకల్లు పిఎస్, కృష్ణ జిల్లా…
2.క్రైమ్.నం.28/18 u/s 379 ఐపిసి ఆఫ్ మాచారెడ్డి పిఎస్, కామారెడ్డి జిల్లా…
3.క్రైమ్.నం.52/18 u/s 379 ఐపిసి ఆఫ్ ములుగు పిఎస్, భూపాలపల్లి జిల్లా…
4.క్రైమ్.నం.51/18 u/s 379 ఐపిసి ఆఫ్ కొత్తపల్లి పిఎస్, కరీంనగర్ జిల్లా…
5.క్రైమ్.నం.96/18 u/s 379 ఐపిసి ఆఫ్ ఎర్రుపాలెం పిఎస్, ఖమ్మం జిల్లా…
6.క్రైమ్.నం.07/18 u/s 379 ఐపిసి ఆఫ్ బోయిన్ పల్లి పిఎస్, రాజన్న సిరిసిల్ల
జిల్లా…
7.క్రైమ్.నం.111/18 u/s 379 ఐపిసి ఆఫ్ సూర్యాపేట రూరల్ పిఎస్, సూర్యాపేట
జిల్లా…
8.క్రైమ్.నం.243/18 u/s 379 ఐపిసి ఆఫ్ కరీంనగర్ 2 టౌన్ పిఎస్, కరీంనగర్ జిల్లా…
9.క్రైమ్.నం.204/18 u/s 379 ఐపిసి ఆఫ్ మరిపెడ పిఎస్, మహబూబాబాద్ జిల్లా…
నిందితున్ని పట్టుకోవడంలో శ్రమించిన పోలీసుల వివరాలు..
కె.శ్రీనివాస్,ఏసీపీ,సీసీఎస్ ఆధ్వర్యంలో…
1.టి.మహేష్ గౌడ్,ఇన్స్పెక్టర్,కరీంనగర్ 2 టౌన్..
2.ఇ. కిరణ్,ఇన్స్పెక్టర్,సీసీఎస్,కరీంనగర్..
3.పి.నాగరాజు,ఎస్సై,సీసీఎస్,కరీంనగర్..
4.ఎం.రవీందర్ నాయుడు,ఎస్సై,కరీంనగర్ 2 టౌన్..
5.జి.వీరయ్య, ఏఎస్సై,సీసీఎస్,కరీంనగర్..
6.ఎండి.హాసనుద్దీన్,కానిస్టేబుల్,సీసీఎస్,కరీంనగర్..
7.కె.లక్ష్మీపతి,కానిస్టేబుల్,సీసీఎస్,కరీంనగర్..
8.ఎండి.షరీఫ్,కానిస్టేబుల్,సీసీఎస్,కరీంనగర్..
మరియు సిబ్బంది….

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *