అండమాన్ ను తాకిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. భారత దేశంలోని బంగాళఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులంతటా రుతుపవనాలు విస్తరించాయి. మరో 48 గంటల్లో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ తొలివారంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జల్లులు కురువనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *