
పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి అండగా నిలవాలని, భవిష్యత్ లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాల నాయీ బ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీ నుంచి 80మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. క్షౌరశాలలకు విద్యుత్ పై రాయితీ మరిన్ని సంక్షేమ పథకాలకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కుల సంఘాల కమ్యూనిటీ హాలుల నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. ఇప్పుడు టీఆర్ఎస్ తోనే సాధ్యమని టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మర్రిపెల్లి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి జనగాం పర్శరాములు, నాయకులు మర్రి పెల్లి వెంకటేశ్వర్లు, సైదులు, శ్రీనివాస్, పర్శరాములు, రేషపెల్లి జనార్దన్, కృష్ణ మూర్తి, బాలనర్సు, రమేష్, వెంకన్న, బాలరాజు, ముత్యాల సత్తయ్య, వెంకటయ్య, ఎలకంటి వెంకటయ్య, శోభన్, పరుషరాములు, కొండూరి శ్రీరాములు, జమ్మయ్య, యాదగిరి, యాకయ్య, మధు, నర్సింహ, అన్నారపు యాదగిరి, సింహం, సోమయ్య పాల్గొన్నారు.