Breaking News

అంజలి ‘సింహాద్రిపురం’ వస్తోంది.!

anjali

అచ్చతెలుగు అందాల భామ అంజలి నటించగా ఘన విజయం సాధించిన ‘తమ్మివెటైత్తె సుందరం’అనే తమిళ చిత్రం తెలుగులో ‘సింహద్రిపురం’పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. ‘చంద్రముఖి’ఫేం విద్యాసాగర్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. పి.వి.అశోక్ కుమార్ సమర్పణలో శ్రీపూర్ణి క్రియేషన్స్ పతాకంపై బళ్లారి సాగర్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బళ్లారి ఈశ్వరప్ప నిర్మాణ సారధ్యం వహిస్తుండగా డి.నారాయణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీపూర్ణి క్రియేషన్స్ అధినేత బళ్లారి సాగర్ కుమార్ మాట్లాడుతూ… సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బలుపు, జర్నీ, షాపింగ్ మాల్, గీతాంజలి, వంటి చిత్రాలతో తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అంజలి నటించిన ‘సింహద్రిపురం’ను అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. అంజలి పెర్ ఫార్మెన్స్ మరియు ఆమె గ్లామర్, విద్యాసాగర్ సంగీతం ‘సింహద్రిపురం’చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు . ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.నారాయణ, సమర్పణ: పి.వి.అశోక్ కుమార్, నిర్మాణ సారధ్యం: బళ్లారి ఈశ్వరప్ప, నిర్మాత: బళ్లారి సాగర్ కుమార్, దర్శకత్వం: వడివుడయాన్!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *