Breaking News

అంగన్ వాడి కేంద్రాల పనితీరుపై జడ్పీ ఛైర్మన్ తుల ఉమ అసంతృప్తి

అంగన్ వాడి కేంద్రాల పనితీరుపై జడ్పీ ఛైర్మన్ తుల ఉమ అసంతృప్తి

అంగన్ వాడీ కేంద్రాల పనితీరుపై జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె కధలాపూర్ మండలంలోని మూడు అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించగా రికార్డుల్లో ఉన్న విద్యార్ధుల సంఖ్యకు, కేంద్రాల్లో ఉన్న విద్యార్ధుల సంఖ్యకు మధ్య భారీ తేడా ఉందన్నారు. అంగన్ వాడీ కేంద్రాలను స్టీమ్ లైన్ చేయాల్సి అవసరం ఉందన్నారు. రామగుండం జెడ్పీటీసి సభ్యురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాలకు నాసి రకం పప్పును పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సంచిలో తీసుకువచ్చిన పురుగు పట్టిన
పప్పును టేబుల్ పై పోసి సభ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పధకం పై లక్షలు ఖర్చు చేస్తున్న అధికారుల తీరుతో ఫలితం లేకుండా పోతుందన్నారు. ఐసిడిఎస్ అధికారులు క్షేత్ర స్ధాయిలో సందర్శించక పోవటం వల్ల ఇలాంటి పరిస్ధితి తలెత్తుతుందన్నారు. జెడ్పీటీసి సభ్యులు శరత్ రావు మాట్లాడుతూ నెలలో కనీసం 20 నుండి 25 అంగన్ వాడి తనిఖీ చేయాల్సిన సూపర్ వైజర్లు ఆ బాధ్యత నిర్వహించటం లేదన్నారు. మొదట వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

angan-vadi-meeting     kandi-papu

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *